www.TeluguTechnology.com

Active Income Passive Income?

Active Income Passive Income?- ఆక్టివ్ ఇన్కమ్ పాసివ్ ఇన్కమ్

ఆక్టివ్ ఇన్కమ్ పాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి?

Active Income – Passive Income?

 

Active Income అంటే మనం ప్రతి రోజు పనికి వెళ్లి అక్కడ కస్టపడి పనిచేస్తే వచ్చే డబ్బులను ఆక్టివ్ ఇన్కమ్ అని అంటారు. అదేవిధంగా Passive ఇన్కమ్ అంటే మనం ఒక్క సరి పనిచేస్తే నిరంతరం డబ్బులు వచ్చే దాన్ని పాసివ్ ఇన్కమ్ అని అంటారు.

 

ఇందులో ముఖ్యంగా మనము ఆక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటో తెలుసుకుందాం…

 

ప్రస్తుతం ప్రపంచంలో అందరూ పనిచేస్తే తప్ప డబ్బులు రావు, అనే విషయం తెలిసిందే. ప్రతి రోజు ఏదో పని చేసి కడుపు నింపు కోవాలి. అదే విధంగా మనం ఈరోజు ఒక కూలి పని లేదా ఆఫీస్ పని లేదా డ్రైవింగ్ పని ఏదో ఒక పని, ఆ పని నువ్వు మార్నింగ్ వెళ్లి సాయంత్రం దాకా పనిచేస్తే వాళ్ళు డబ్బులు ఇస్తారు. కావున దీనిని మనం ఆక్టివ్ ఇన్కమ్ అని అంటారు. ఆక్టివ్ ఇన్కమ్ అంటే మనం పనిచేస్తే వచ్చే డబ్బులను ఆక్టివ్ ఇన్కమ్ అని అంటారు.

 

మనం ప్రతి రోజు చూస్తూనే ఉంటాం. చాలా మంది డబ్బులు సంపాదించడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి. అదే విధంగా ప్రతి చాలా మంది వాళ్ళు పనిచేసే కష్టానికి వాళ్ళకి వచ్చే డబ్బులకి ఏవి సంబంధం ఉండదు. ఎందుకంటె ఇక్కడ కష్టం మాత్రం ఉంటుంది ఫలితం అంతగా రాదూ. అదే విధంగా కొంత మంది తక్కువ కష్టమే చేస్తారు కానీ వాళ్ళకి వాళ్ళు చేసే పనికన్నా చాలా ఎక్కువ మొత్తం లో డబ్బులు రావడం జరుగుతుంది.

 

ప్రపంచంలో ప్రతిఒక్కరు డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి. అందులో ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకొని డబ్బులు సంపాదించడం అనేది జరుగుతుంది. ఈ విషయం లో చదుకున్న వారు ఉద్యోగం చేసి డబ్బులు సంపాదిస్తారు. చదుకోలేని వారు రోజు కూలి పని చేసి సంపాదిస్తుంటారు. అలాగే వేరు వేరు పనుల ద్వారా సంపాదిస్తుంటారు. కానీ సంపాదించే విషయంలో మాత్రం తేడాలు అనేవి ఉంటాయి అందులో ముఖ్యంగా ఒకటి కష్టపడి పనిచేసి సంపాదించడం, మరియు తక్కువ పనిచేసి ఎక్కువ సంపాదించడం. దీనినే మనం ఆక్టివ్ ఇన్కమ్ పాసివ్ ఇన్కమ్ అని అంటాము.

 

Active Income Passive Income?

ఉదాహరణ:-

కొంతమంది ప్రతిరోజు ఎనిమిది గంటలు, పది గంటలు, పన్నెడు గంటలు, కొందరు అయితే ఇరవైనాలుగు గంటలు పనిచేసి, మరి డబ్బులు సంపాదిస్తుంటారు. ఇందులో రెండు రకాల సంపాదనలు ఉన్నాయి. కష్టపడి పనిచేసేది, కొంచం కష్టం తో పనిచేసేది. ముందుగా మనము కష్టపడి పనిచేసి డబ్బులు సంపాదించేవారి గురుంచి తెలుసుకుందాం..

 

Active Income-Passive Income Tips

 

Active ఇన్కమ్:-

 

మీరు కొంత మదిని గమనించినట్లయితే కొందరు కూలికి వెళ్లి అక్కడ సిమెంట్ బస్తాలు మోస్తూనే ఉంటారు. లేదా ఒక కూలి పని అయితే పొలానికి వెళ్లి పనిచేయడం, లేదా ఒక మెశ్రీ కింద పనిచేయడం. రోజంతా డ్రైవింగ్ చేయడం. షాపింగ్ కాంప్లెక్స్ లలో పనిచేయడం. లేదా ఎండలో కూర్చొని రాత్రి వరకు కూరగాయలు అమ్మడం. డ్యూటీ కి వెళ్లి అక్కడ సాయంత్రం వారికి పని చేయడం ఇవన్నీ కూడా ఆక్టివ్ ఇన్కమ్ కిందనే వస్తాయి. అంటే పనిచేస్తేనే డబ్బులు సంపాదించడం.
Passive ఇన్కమ్:-
మరి కొంతమంది ఉంటారు వీళ్ళు అసలు సంపాదించడం చూస్తే ఆశ్చర్యపోతారు. ఎందుకంటె వీళ్ళ సంపాదన కస్టపడి పనిచేసే వాళ్ళకంటే చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు రోజులో ఒక గంట లేదా రెండు గంటలు లేదా ఆరు గంటల వారికి మాత్రమే పని చేస్తారు కానీ వీళ్ళు సంపాదించే డబ్బులు మాత్రం, కష్టపడి సంపాదించే వారికంటే కూడా రెండింతలు లేదా మూడింతలుగా ఉంటుంది. దీనిని మనం పాసివ్ ఇన్కమ్ గా చెప్పడం జరుగుతుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *