www.TeluguTechnology.com

how to create a free website

How To Create A Free Website – వెబ్సైట్ ని ఫ్రీగా ఎలా తయారు చేసుకోవాలి

ఒక వెబ్సైటు ని ఫ్రీ గా ఎలా తయారు చేసుకోవాలి.

ఒక వెబ్సైటు ని ఫ్రీ గా ఎలా తయారు చేసుకోవాలి. చాల మంది ఇంటర్నెట్ లో ఫ్రీగా ఒక వెబ్సైటు ని తయారు చేసుకోవాలని అనుకుంటారు. అందుకే ఈరోజు మన తెలుగుటెక్నాలజీ లో ఒక వెబ్సైటు ని ఫ్రీగా ఎలా తయారు చేసుకోవాలి ఎక్కడ తెలియజేస్తాం.how to create a free website
మనం ముందుగా ఒక వెబ్సైటును తయారు చేసుకోవాలని అనుకుంటే దానికి కొంచం ఇంటర్నెట్ పరిజ్ఞానం తెలిసి ఉండాలి. ఇలా కాకుండా చాలా మంది ఏం చేస్తారంటే కొంచం డబ్బులు ఇచ్చి డెవలపర్స్ తో వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు వాళ్ళకి నచ్చిన వెబ్సైటు ని తయారు చేపించుకుంటారు కానీ ఇక్కడ మీరు మేము చెప్పిన విధంగా చేసి మీరే ఒక మంచి వెబ్సైటు ని మీకు నచ్చిన విధంగా తయారుచేసుకోగలరు.
అందుకు మీరు మేము చెప్పిన విధంగా ఇక్కడ అన్నింటిని గమనించి క్రమంగా నేర్చుకొని తయారు చేయండి. అదే విధంగా ఒక వెబ్సైటు ని మీరు చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు. మీరు ఒక డైరీ లాగా కూడా వాడుకోవచ్చు. అలాగే మీరు మీకు నచ్చిన ఫాషన్ కూడా మార్చుకోవచ్చు. అంతే కాకుండా మీకు తెలుసా మనం మనకి నచ్చిన వెబ్సైటు ని తయారు చేసుకొని దాని నుండి మనం డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు.
మీరు మీకు నచ్చిన దాని మీద ఒక వెబ్సైటు ని క్రియేట్ చేసుకునే ముందు మీరు దానిని ఎందుకు క్రియేట్ చేస్తున్నారు దానివల్ల మీకు ఏంటి ఉపయోగం అనేది తెలిసి ఉండాలి. ముక్యంగా ఒక వెబ్సైటు ని తయారు చేయాలంటే మీరు ఒక టాపిక్ ని ఎంచుకోవాలి అంటే ఆ టాపిక్ మీద మీకు అన్ని తెలిసి ఉండాలి.

ఉదాహారన:
 • మీకు మంచిగా ఒక టెక్నాలజీ మీద టాలెంట్ ఉంటె మీరు టెక్నాలజీ పరంగా ఒక వెబ్సైటు ని క్రియేట్ చేసుకోవచ్చు.
 • మీరు బాగా వంటలు చేస్తే మీరు ఒక మంచి ఫుడ్ వెబ్సైటు ని తయారు చేసుకొని దాంట్లో మీరు వంటలని ఎలా తయారు చేయాలో చేప్తే చాలు అది మీ వెబ్సైటు ని చాల మంది చూస్తారు.
 • లేదా మీరు ఒక సినిమా రంగం పైన అవగాహనా ఉంటె లేదా మీరు బాగా మూవీస్ చూస్తే వాటిపైన మీరు ఒక రివ్యూ రాయవచ్చు.
 • ఇదే విధంగా మీరు ఒక మూవీ రివ్యూ అనే వెబ్సైటు ని తయారు చేసుకొని దాంట్లో మీరు చుసిన లేక కొత్త కొత్త సినిమాలపైన మీరు మంచి రివ్యూస్ ని రాసి మంచిగా మీ వెబ్సైటు ద్వారా డబ్బులు సంపాదించవచ్చు.
 • అలాగే మీకు టీచర్ గా మీకు నచ్చిన సబ్జెక్టు ని మీ వెబ్సైటు లో ఒక సబ్జెక్టు గురుంచి బాగా చేబితే చాలు.
 • మీరు ఒక ట్రావెలర్ అనుకోండి మీకు నచ్చిన, మీరు తిరిగి వచ్చిన ప్రాంతాల గురుంచి, అక్కడి విశేషాల గురుంచి మీ వెబ్సైటు లో షేర్ చేయండి ఇలా కూడా మీరు మీ వెబ్సైటు తో సంపాదించుకోవచ్చు.

మీకు నచ్చిన మీకు వచ్చిన దాని గురుంచి మీరు మీ వెబ్సైటు లో ఒక మంచి పోస్ట్ చేస్తే వాటిని చాలా మంది చూసి నచ్చితే ఇంకా ఎక్కువ మందికి షేర్ చేస్తారు సో ఎలా మీ వెబ్సైటు గ్రోత్ పెరుగుతుంది అలాగే మీరు డబ్బు కూడా బాగా సంపాదించుకోవచ్చు.

 

వెబ్సైటు ని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు తెలుసుకుందాం.

బ్లాగర్ – వర్డ్ ప్రెస్ 

బ్లాగర్ అనేది వ్యక్తులు లేదా సంస్థలు వివిధ అంశాలపైనా సంబందించిన పోస్ట్లు లేదా కంటెంట్ ను ప్రచురించగల ప్లాట్ ఫార్మ్ నే బ్లాగ్ అంటారు. అదే విధంగా చాలా మంది తమ తమ నచ్చిన విధంగా కంటెంటును పోస్ట్ చేయడానికి ఎంపిక చేసుకునే ప్లాట్ పారం లో ముక్యంగా రెండు. ఒకటి బ్లాగ్ మరియు రెండవది వర్డుప్రెస్సు ఈ రెండు ప్లాట్ ఫాన్స్ వలన అనేక మంది తమకు వచ్చిన, మరియు నచ్చిన అలాగే నైపుణ్యం లేదా సమాచారాన్ని ఇంటర్నెట్ ఆన్లైన్ లో పంచుకోవడానికి ఈ ఒక్క బ్లాగ్ ను మరియు వర్డుప్రెస్సు ను ఉపయోగిస్తారు.

వ్యక్తిగత బ్లాగింగ్:  కొంతమంది తమ బ్లాగర్‌లు వారి రోజువారీ అనుభవాలు, ఆలోచనలు మరియు కథనాలను పంచుకుంటారు, పాఠకులను వ్యక్తిగత స్థాయిలో కనెక్ట్ చేయడానికి అనుమతిస్తుంది. ఈ బ్లాగులు సంబంధాల నుండి వ్యక్తిగత వృద్ధి వరకు అనేక రకాల అంశాలను కవర్ చేయగలవు.
ప్రయాణం: పైన చెప్పిన విధంగా కొంతమంది ట్రావెల్ బ్లాగర్లు తమ పాఠకులకు ప్రయాణ చిట్కాలు, గమ్యస్థాన మార్గదర్శకాలు మరియు సిఫార్సులను అందిస్తూ వారి సాహసాలను అన్వేషించి, మొత్తం డాక్యుమెంట్ చేసి వారి బ్లాగ్ లో పోస్ట్ చేసుకుంటారు.
ఫ్యాషన్ మరియు అందం: ఇంకొంత మంది బ్లాగర్లు తాజా ఫ్యాషన్ ట్రెండ్‌లు, సౌందర్య ఉత్పత్తులు మరియు చర్మ సంరక్షణ నిత్యకృత్యాలను గురుంచి, వారు తరచుగా దుస్తుల ఆలోచనలు, మేకప్ ట్యుటోరియల్‌లు మరియు ఉత్పత్తి సమీక్షలను కలిగి ఉండి వాళ్ళకి వచ్చిన ఫాషన్ ని వాళ్ళు బ్లాగ్ లో రాసుకుంటారు అలాగే అవి అందరికి చేరవేస్తారు.
టెక్నాలజీ : టెక్ బ్లాగర్లు గాడ్జెట్‌లు, సాఫ్ట్‌వేర్ మరియు సాంకేతిక వార్తల ప్రపంచంలోకి ప్రవేశిస్తారు. వారు కొత్త ఉత్పత్తులను సమీక్షిస్తారు, ట్రబుల్షూటింగ్ చిట్కాలను అందిస్తారు మరియు పరిశ్రమ అభివృద్ధి గురించి వారు తమ బ్లాగ్ లలో లేదా వెబ్సైటు లలో వీటి గురుంచి పోస్ట్లు చేస్తారు.
ఆరోగ్యం: ఏది సెలెక్ట్ చేసుకున్న బ్లాగర్‌లు శారీరక మరియు మానసిక ఆరోగ్యంపై దృష్టి పెడతారు, ఫిట్‌నెస్, పోషకాహారం, సంపూర్ణత మరియు వివిధ ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడంపై సలహాలను వారి బ్లాగ్ లలో పోస్ట్లుపెట్టి మనకి సమాచారం అందిస్తారు.
ఆహారం మరియు వంట: ఆహార బ్లాగర్లు వంటకాలు, వంట పద్ధతులు, రెస్టారెంట్ సమీక్షలు మరియు ఆహార సంబంధిత కథనాలను పంచుకుంటారు. వారు తరచుగా వండిన మరియు తిన్న అనుభూతులను మరియు ఎలా ఎలా మనం వాటిని తయారు చేసుకోవాలో మనకి తెలిసేలా నోరూరించే ఫోటోలను కూడా వారి వారి వెబ్సైట్ లలో పోస్ట్లు పెడతారు.
వ్యక్తిగత బ్లాగింగ్: కొంతమంది బ్లాగర్‌లు వారి రోజువారీ అనుభవాలు, వారికీ వచ్చిన ఆలోచనలు మరియు కథనాలను పంచుకుంటారు, పాఠకులను వ్యక్తిగత స్థాయిలో కనెక్ట్ చేయడానికి అనుమతిస్తుంది. ఈ బ్లాగులు సంబంధాల నుండి వ్యక్తిగత వృద్ధి వరకు అనేక రకాల అంశాలను కవర్ చేయగలవు. వారు నేర్చుకున్న ప్రతిదీ ఎక్కడ వారి బ్లాగ్ లలో పోస్టులు చేస్తారు.
జీవనశైలి: లైఫ్‌స్టైల్ బ్లాగర్‌లు ఇంటి అలంకరణ, పేరెంటింగ్, ప్రాజెక్ట్‌లు మరియు సంస్థ చిట్కాలు వంటి అంశాలతో సహా విస్తృత స్పెక్ట్రమ్‌ను కవర్ చేస్తారు. వారి కంటెంట్ తరచుగా పోస్టులు చేయడం వలన జీవన నాణ్యతను పెంచే లక్ష్యంతో ఉంటుంది.
ఆర్థిక మరియు వ్యక్తిగత అభివృద్ధి: ఈ బ్లాగర్లు ఆర్థిక నిర్వహణ, పెట్టుబడి, పొదుపు మరియు వ్యక్తిగత మరియు ఆర్థిక లక్ష్యాలను సాధించడంలో సలహాలను అందిస్తారు. ఎలా చేస్తే ఏంటి చాల మంది ఏ మధ్య ఎందులో పెట్టుబడులు పెట్టాలి అని ఆలోచనలతో ఉంటారు అందుకే ఏ బ్లాగువారు ఆ టాపిక్స్ కి సంబదించిన పోస్ట్లు చేస్తారు.
వినోదం : ఈ బ్లాగర్‌లు చలనచిత్రాలు, టీవీ కార్యక్రమాలు, పుస్తకాలు, సంగీతం మరియు ప్రముఖుల గురించి చర్చిస్తారు. వారు సమీక్షలను వ్రాయవచ్చు, సిఫార్సులను పంచుకోవచ్చు మరియు ట్రెండ్‌లను విశ్లేషించవచ్చు. వారికీ నచ్చిన వాటి గురుంచి వారు ఎక్కడ తెలియజేస్తూ ఉంటారు. ఒక సినిమా గురుంచి కానీ లేదా ఒక టీవీ కార్యక్ర మాలపైనా వారి రివ్యూ లాగా తెలియజేసి విధంగా కంటెంట్ రాసి బ్లాగ్ లలో పోస్ట్లు చేస్తారు. కొంతమంది బ్లాగర్‌లు సముచిత అభిరుచులు (ఉదా., పక్షులను చూడటం, గేమింగ్, గార్డెనింగ్), సముచిత ఆహారాలు (ఉదా. శాకాహారి, కీటో), అదేవిధంగా సిద్ధాంతాలు, పురాతన చరిత్ర వంటి నిర్దిష్ట సముదాయాలపై దృష్టి సారిస్తారు. వాటినే వారి వెబ్సైట్ లో పొందుపరుస్తారు.

సారాంశంలో, బ్లాగర్లు వారికి మరియు వారి లక్ష్య ప్రేక్షకులకు ఆసక్తి ఉన్న వాటి గురించి వ్రాస్తారు. వారి పాఠకులతో ప్రతిధ్వనించే విలువైన మరియు ఆకర్షణీయమైన కంటెంట్‌ను అందించడం కీలకం. ఎందుకంటె వారి కంటెంట్ మనకి నచ్చితే ప్రతి రోజు వారి బ్లాగ్ ని లేదా వెబ్సైటు ని మనం వీక్షించగలరని. వారు వారి బ్లాగ్ లలో వెబ్సైటు లలో కంటెంట్ పోస్ట్లు చేస్తారు.

ఫైనల్ గా ఇపుడు మనం బ్లాగ్ ని ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం.
 • ముందుగా ఇపుడు ప్రస్తుతం అందరి దెగర స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి. లేదా మీ దెగర ఉన్న కంప్యూటర్ లో కానీ ల్యాప్టాప్ లో ముందుగా మీరు ఒక బ్రౌసర్ లో గూగుల్ని ఓపెన్ చేయండి.
 • మీరు ఓపెన్ చేసిన గూగుల్ సెర్చ్ లో బ్లాగర్ అని టైపు చేయండి. ఇపుడు మీకు ఒక పేజీ అనేది ఓపెన్ అవుతుంది దాంట్లో మీరు మీకు స్మార్ట్ ఫోన్స్ ఉన్నవి కాబట్టి మీ జీ మెయిల్ అనేది కనెక్ట్ చేయండి.
 • అంటే మీరు బ్లాగర్ కి మీ జిమెయిల్ తో కనెక్ట్ చేయడం వలన బ్లాగర్ అనే ప్లాట్ ఫార్మ్ అనేది ఓపెన్ అవుతుంది.
  ఇక్కడ మనం కొన్ని విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటె చాలా మంది తమకి నచ్చిన పేర్లు లేచి తమకి నచ్చినట్టు వారి వెబ్సైటు నామ ఉండాలి అనుకుంటారు.
 • ఇదే వారికీ అడ్రస్ అన్నట్టు ఎవరైనా మీ వెబ్సైటు ని చూడాలి అనుకుంటే వారు గూగుల్ లో ఇదే సెర్చ్ చేస్తారు అపుడు మీ వెబ్సైటు కి ఓపెన్ అవుతుంది.
 • అందుకే మీరు సరిగ్గా చూసుకొని మీకు నచ్చిన పేరుతో ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ మనం మనకి నచ్చిన పేరును ఎంటర్ చేయగానే అక్కడ అది అవేలబుల్ ఉంటేనే మనకి అందిస్తుంది.
 • లేదా దానికి ఏదైనా మన పేరు చివరన ఒక పేరు ఏదైనా జోడించి ఇస్తే అపుడు అవలబుల్ అని వస్తుంది అపుడు మనం మన బ్లాగర్ ప్లాట్ ఫార్మ్ లోకి ఎంటర్ అవుతాము.
మనం మన బ్లాగ్ ఓపెన్ అయ్యాక ఏం చేయాలో నెక్స్ట్ పోస్ట్ లో తెలుసుకుందాం….
బ్లాగ్ నుండి డబ్బులు సంపాదించడం ఎలానో తెలుసుకుందాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *