www.TeluguTechnology.com

How to Download Aadhaarcard Telugu

How to Download Aadhaarcard Telugu : ఆధార్ కార్డు ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?

ఆధార్ కార్డు ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇక్కడ ఒక సులువైన మార్గం ఉంది. ఇపుడు మీరు మీ ఆధార్ కార్డు నీ మీ మొబైల్ లేదా కంప్యూటర్ మీరే సొంతంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ముందుగా మొబైల్ లేదా మీ కంప్యూటర్ లో గూగుల్ ని ఓపెన్ చేసి UIDAI అనే వెబ్సైటు ని ఓపెన్ చేయండి.

మీరు ముందుగా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడానికి అనే వెబ్సైటు ని గూగుల్ లో ఓపెన్ చేయండి. అదే విధంగా మీరు ఎంటర్ చేయగానే మీకు ఒక పేజీ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు ఆధార్ కార్డు కి సంబందించిన, చాలా ఆప్షన్స్ కనిపిస్తుంటాయి. ఇందులో మీకు ముందుగా..

 

  • అప్డేట్ ఆధార్ కార్డు
  • గెట్ ఆధార్
  • ఆధార్ సర్వీసెస్

 

  • ఈ మూడు ఒప్షన్స్ కనిపిస్తుంటాయి. ఇందులో మీరు ముందుగా గెట్ ఆధార్ అనే దాంట్లో కింద వరుసలో మూడవది ఆధార్ డౌన్లోడ్ అనే ఆప్షన్ ని ఎంటర్ చేయండి. ఇక్కడ కూడా మీకు చాలా బాక్స్ కనిపిస్తుంటాయి.
  • అయితే అందులో మీరు మొదటి వరుసలో ఉన్న, రెండవ బాక్స్ డౌన్లోడ్ ఆధార్ అని ఉంటుంది దానిని క్లిక్ చేయండి.
  • మీకు ఇపుడు ఆధార్ డౌన్లోడ్ అనే బాక్స్ ని క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజీ లోకి ఎంటర్ అవుతాము. అయితే ఇపుడు మన ఆధార్ ని డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తుంటాయి.
  • సెలెక్ట్ 12 డిజిట్ ఆధార్ నెంబర్ /16 డిజిట్ వర్చ్యువల్ ID (VID) / 28 డిజిట్ ఎన్రోల్మెంట్ ID (EID) అనే ఆప్షన్స్ మీకు చూపిస్తుంది.
  • ఇందులో మీరు మీ ఆధార్ నెంబర్ ని సెలెక్ట్ చేసుకోని మీరు మీ ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేయండి.
    ఇక్కడ మీకు మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తరువాత, మీకు కింద ఒక ఎంటర్ క్యాప్చర్ అనేది చూపిస్తుంది.
  • అయితే ఇక్కడ బాక్స్ లో పక్కన ఇవ్వబడిన లెటర్స్ ని ఇందులో ఎంటర్ చేయాలి. గుర్తుంచుకోండి మీకు పక్కన ఇవ్వబడిన లెటర్స్ ఎలా ఉంటె అలానే ఎంటర్ చేయండి. ఆలా చేస్తేనే మీకు ఆధార్ అనేది డౌన్లోడ్ అవుతుంది.
  • మీరు లెటర్స్ ని ఎంటర్ చేసిన తరువాత, కింద మీకు సెండ్ ఓటీపీ అనేది కనిపిస్తుంది.
  • ఇది మీకు ఎందుకు అంటే మీరు ఆధార్ డౌన్లోడ్ చేసుకోడానికి, మీ మొబైల్ కి ఆధార్ కార్డు కి లింక్ ఉన్న మొబైల్ కి ఒక పాస్వర్డ్ అనేది వెళ్తుంది.
  • మీరు సెండ్ ఓటీపీ అనేది బటన్ క్లిక్ చేయగానే మీ మొబైల్ కి ఒక ఓటీపీ అనేది వస్తుంది.
  • ఈ ఓటీపీ ని మీకు ఒక బాక్స్ లో ఎంటర్ ఓటీపీ ని ఆప్షన్ కనిపిస్తుంది. మీ మొబైల్ కి వచ్చిన ఓటీపీ ని దాంట్లో ఎంటర్ చేయండి.
  • తరువాత మీకు ఇంకొక పేజీ అనేది ఓపెన్ అవుతుంది.
  • కంగ్రాట్యులేషన్స్ !!! యువర్ ఆధార్ కార్డు హస బీన్ సక్సెస్ ఫుల్ డౌన్లోడ్డ్ అని వస్తుంది. ది ఆధార్ లెటర్ పిడిఎఫ్ పాస్వర్డ్ విల్ బె ఇన్ 8 క్యారెక్టర్స్ కాంబినేషన్ అఫ్ ది ఫస్ట్ ఫోర్ లెటర్స్ అఫ్ యువర్ నేమ్ (అస్ ఇన్ ఆధార్ ) ఇన్ కాపిటల్ లెటర్స్ అండ్ ఇయర్ అఫ్ బర్త్ ఇన్ YYYY ఫార్మటు . అని వస్తుంది.
  • అంటే దీనికి అర్థం ఏంటంటే మీకు ఆధార్ కార్డు డౌన్లోడ్ ఐన తరువాత, మీరు ఆధార్ కార్డు ని ఓపెన్ చేయాలనుకుంటే మీరు ఓపెన్ చేయలేరు ఎందుకంటె దానికి పాస్వర్డ్ అనేది ఉంటుంది. అది ఏంటంటే, మీరు మీ ఆధార్ కార్డు డౌన్లోడ్ అనేది పిడిఎఫ్ లో డౌన్లోడ్ అవుతుంది.

 

ఇపుడు మీరు ఆ పిడిఎఫ్ ఫైల్ ని ఓపెన్ చేసి మీ పేరు లో అంటే మీ ఇంటి పేరుతో సహా ఉన్న మీ పేరును, ముందు వరుసలో ఉన్న 4 లెటర్స్ ని ఎంటర్ చేసి అదే విధంగా మీ డేట్ బర్త్ లోని మీ ఇయర్ ని ఎంటర్ చేయాలి. మీ పేరులో ని మొదటి 4 అక్షరాలు మరియు మీరు పుట్టిన ఇయర్ ని ఎంటర్ చేయగానే మీ ఆధార్ కార్డు అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇలా మీరు మీ ఆధార్ కార్డు ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *