www.TeluguTechnology.com

What is The Emergency Alert Message

What is The Emergency Alert Message : ఎమర్జెన్సీ అలెర్ట్ మెసేజ్ ఎందుకు వస్తుంది?

ఎమర్జెన్సీ అలెర్ట్ మెసేజ్ ఎందుకు వస్తుంది?

ప్రస్తుతం చాలా మంది మొబైల్స్ కి ఇలా అలెర్ట్ మెసేజ్ అనేది వస్తుంది. ఇలా రాగానే చాలా మంది తమ మొబైల్స్ కి ఎందుకు ఇలా వస్తుందని కంగారు పడ్తున్నారు. నా ఫోన్ హాక్ అయ్యిందా ఏమైంది అని, నాకే వస్తుందా ఎవరికి రావట్లేదా అని భయపడుతున్నారు. కానీ ఇది అందరి మొబైల్స్ కి వస్తది. దీనివలన ఎవరు కూడా భయపడాల్సిన పనిలేదు.

 

What is The Emergency Alert Message

 

ఎందుకు అనగా ఇది ఒక గవర్నమెంట్ వాళ్ళు టెస్టింగ్ కోసం ఇలా అందరి మొబైల్స్ కి, డిపార్ట్మెంట్ అఫ్ టెలికమ్యూనికేషన్, గవర్నమెంట్ అఫ్ ఇండియా. నుండి ప్రతి మొబైల్ కి ఈ పాప్ అప్ అలెర్ట్ మెసేజ్ అనేది వస్తుంది. ఇది నార్మల్ గా, గవర్నమెంట్ చేసిన ఒక చిన్న టెస్టింగ్ అన్నమాట. ఈ మెసేజ్ అనేది ఎవరెవరికి వచ్చిందో వాళ్ళు ఏం భయపడాల్సిన అవసరం లేదు. మరియు రాని వాళ్ళకి కూడా ఇది తొందరలోనే వస్తది అన్నమాట.

 

ఇది ఏవిధంగా వస్తుంది, అంటే మనం మొబైల్ ఒకవేళ సౌండ్ ఆఫ్ చేసిన సరే పాప్ అప్ మెసేజ్ గా వచ్చి ఒక సౌండ్ చేస్తూ వైబ్రేషన్ తో వస్తుంది. చాలా మంది మేము మొబైల్ సైలెంట్ లో పెట్టిన కూడా ఎలా వస్తుంది. అనుకుంటారు కానీ గవర్నమెంట్ వాళ్ళు ఈ అలెర్ట్ మెసేజ్ అనేది ఒక అల్లారం టోన్ తో మీ మొబైల్స్ సైలెంట్ లో ఉన్న కూడా అల్లారం తో వైబ్రేషన్స్ తో ఈ మెసేజ్ అనేది మోగుతూనే ఉంటుంది. అలానే ఈ మెసేజ్ అనేది హిందీ మరియు ఇంగ్లీష్ భాషలలో వస్తుంది. అసలు ఈ మెసేజ్ అనేది ఎందుకు వస్తుంది అనే దాని గురుంచి ముందుగా తెలుసుకుందాం.

ఈ అలెర్ట్ మెసేజ్ ఎందుకు మొబైల్స్ కి వస్తుంది? ఇపుడు తెలుసుకుందాం…

ఈ మెసేజ్ అనేది గవర్నమెంట్ వాళ్ళు జులై లో దీనిని అందరి మొబైల్ కి పంపించడం జరిగింది. అయితే సెప్టెంబర్ పదిహేను నుండి చాలా మంది మొబైల్స్ కి అయితే రావడం జరుగుతూనే ఉంది. ఇంకా చాలా మందికి రాలేదు అనుకుంటే తప్పకుండ మీ మొబైల్స్ కూడా రావడం జరుగుతుంది. ఇలాంటి అలెర్ట్ మెసేజ్ అనేది గవర్నమెంట్ వాళ్ళు ఎందుకు ఇలా పంపుతున్నారు దాని వాళ్ళ ఏంటి ఉపయోగం అనుకుంటే, ప్రస్తుతం ఇది ఒక శాంపిల్ టెస్ట్ మాత్రమే అయితే ముందు ముందు ఈ సర్వీస్ ని గవర్నమెంట్ వాళ్ళు ప్రజలకి ఏదైనా తెలియజేయడానికి అంటే ముందు వచ్చే ఆపదల నుండి కానీ లేదా ఏదైనా ప్రజలకి హాని కలిగించే వాటినుండి ప్రజలను రక్షించడానికి ముందుగా సమాచారం ఇవ్వడానికి ఇలాంటి అలెర్ట్ మెసేజ్ ని అయితే ప్రజల్లోకి ఇప్పుడు తీసుకురావడం జరిగింది.

 

ఒక విధంగా చెప్పాలంటే ప్రస్తుతం చాలా వరకు ముందు జరిగే పరిణామాలు లేదా ఏవైనా వ్యాధులు వస్తున్నాయి, లేదా భూకంపం ఇలాంటి గవర్నెమెంట్ వాళ్ళకి ముందే తెలిసిపోతుంది. ఇలాంటి వాటిని ప్రజలకి ముందే తెలియజేయాలంటే, ఒక్కొక్కరికి చెప్పాలంటే లేదా వాట్సాప్ లలో తెలియజేయాలంటే చాలా టైం పడుతుంది. అందుకే ఈ అలెర్ట్ మెసేజ్ అనేది అందరికి తొందరగా చేరుకుంటుంది. అందుకే ఇలాంటి సర్వీస్ ను గవర్నమెంట్ వాళ్ళు తీసుకురావడం జరిగింది. అందుకే ముందుగా శాంపిల్ గా ఒక అలర్ట్ మెసేజ్ ని అందరి మొబైల్ కి పంపించడం జరిగింది.

One comment

  1. I came across your wordpress website and saw you haven’t done much with it. Is there something stopping you from completing it? Or do you need some help to finish it?

    I’m Christopher Grand a website developer. I can create a 1 page website if you want me to.

    If you like the website you can keep it, pay me nothing. It’s yours for FREEE!

    If you don’t like the website, then you can throw it away.

    There’s really no risk.

    Reply so, I can start creating a website.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *